తీపి కబురు చెప్పిన డార్లింగ్.. లోకేష్‌పై కోర్టులో కేసు..

TV9 Telugu

06 January 2024

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్‌, సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు.

ఆల్రెడీ పార్ట్‌ 2 శౌరంగ పర్వం కథ సిద్ధంగా ఉందన్న డార్లింగ్‌, త్వరలోనే ఆ మూవీని పట్టాలెక్కిస్తామని చెప్పారు.

వీలైనంత త్వరగా సీక్వెల్‌ను థియేటర్లలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు రెబెల్ స్టార్ ప్రభాస్.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్‌ పార్ట్ 1 సీజ్ ఫైర్ మూవీ 700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ మానసిక పరిస్థితిని ఎగ్జామిన్ చేయాలంటూ ఓ వ్యక్తి కోర్టులో కేసు వేశాడు.

లియో సినిమా చూసిన రాజా మురుగన్‌, ఆ సినిమాలో సోసైటీకి హని కలిగించే అంశాలు ఉన్నాయంటూ కోర్టును ఆశ్రయించారు.

అలాంటి సినిమాల విషయంలో ఇండియన్ సెన్సార్ బోర్డ్‌ మరింత జాగ్రత్త వ్యవహరించాలని సూచించారు రాజా మురుగన్‌.

లోకేష్ సినిమాల్లో వైలెన్స్ ఎక్కువగా ఉంటుందని, అందుకే ఆయన మెంటల్‌ కండిషన్‌ ఎలా ఉందో చెక్‌ చేయాలని కోరారు.