10 November 2023

సూపర్ డూపర్ న్యూస్‌.. సలార్ ట్రైలర్‌ రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్.. !

ప్రశాంత్‌ నీల్ డైరెక్షన్లో.. పాన్ ఇండియా రెబల్ స్టార్  ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్‌. 

పాన్ ఇండియా రేంజ్లో.. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్‌కు రెడీ అవుతోంది. 

రిలీజ్ డేట్ దగ్గర పడడంతో.. ప్రభాస్‌ సలార్ ట్రైలర్‌ వైపే అందరి చూపు ఉంది. 

ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్‌.. అనౌన్స్ మెంట్ తొందర్లో అంటూ... ఓ గ్రాండ్ పోస్ట్‌ర్ బటయటికి వచ్చింది

అయితే హోంబలే ఈ అనౌన్స్‌మెంట్ అలా చేసిందో లేదో.. అప్పుడే సలార్ అఫీషియల్ ట్రైలర్ రిలీజ్‌ డేట్ నెట్టింట లీకైంది.

సలార్ ట్రైలర్ రిలీజ్‌ డేట్ డిసెంబర్ 1 అనే న్యూస్ నెట్టింటి కొచ్చేసింది. 

డిస్ట్రిబ్యూటర్ల కారణంగా... డార్లింగ్ హార్డ్ కోర్ అభిమానుల ఫ్యాన్ పేజీల కారణంగా... ఈ విషయం బయటికి తెలిసింది.

ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం విపరీతంగా వైరల్ అవుతూ పాన్ ఇండియా రెబల్‌ ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది.