సలార్ లో అఖిల్‌ పాత్రపై క్లారిటీ.. సరిపోదా శనివారం థియేట్రికల్‌ రైట్స్..

TV9 Telugu

22 January 2024

సలార్‌ సెకండ్‌ పార్టులో అఖిల్‌ అక్కినేని కీలక పాత్రలో కనిపిస్తారంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని అన్నారు ప్రశాంత్‌ నీల్‌ సతీమణి లిఖితా రెడ్డి.

తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన ఆమె అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.

సలార్‌ పార్ట్ 2 లో మంచి మాస్‌ సాంగ్‌ ఉంటుందని అన్నారు. దీంతో డార్లింగ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సీక్వెల్‌లో ప్రభాస్‌ కేరక్టర్‌ గురించి కొన్ని తరాల పాటు మాట్లాడుకుంటారని సోషల్ మీడియా వేదిక అన్నారు లిఖితా రెడ్డి.

2022 హాయ్ నాన్న బ్లాక్ బస్టర్ తర్వాత నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న సినిమా సరిపోదా శనివారం.

అంటే సుందరానికి ఫేమ్ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ థియేట్రికల్‌ రైట్స్ ఎస్‌వీసీ సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది.

పక్కా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది సరిపోదా శనివారం. ఇందులో నానికి జోడిగా ప్రియాంక మోహన్ నటిస్తుంది.