సలార్ గురించి క్రేజీ అప్డేట్.. తండేల్‌ షూటింగ్ అప్డేట్..

TV9 Telugu

07 February  2024

రిలీజ్‌ దగ్గర నుంచే సంచలనాలు నమోదు చేస్తున్న సలార్‌ పార్ట్ 1 సీజ్ ఫైర్, మరో అరుదైన రికార్డ్ సెట్ చేసింది.

తాజాగా ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్‌ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటికే తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా సోమవారం నుంచి ఇంగ్లీష్‌లోనూ అందుబాటులోకి వచ్చింది.

ఇంకా హిందీ వర్షన్‌ విడుదల కావాల్సి ఉండగా.. ఇది మాత్రం మార్చి నెలలో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.

నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా మూవీ తండేల్‌. ఇందులో చైతు జాలరిగా కనిపించనున్నారు.

చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో చైతూకి జోడిగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ మరో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుంది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన మేకర్స్. దీనికి సంబంధించి వర్కింగ్‌ స్టిల్స్‌ను షేర్ చేశారు.