29 December 2023

సలార్ దెబ్బకు బేజారవుతున్న ఫిల్మ్ రికార్డ్స్‌

TV9 Telugu

మైనింగ్ మెషిన్! బాక్సాఫీస్ బుల్డోజర్ !! కలెక్షన్స్‌ కా ఎక్స్‌కావేటర్ !! వన్‌ అండ్ ఓన్లీ కటౌట్‌ !! అది సలార్ అలియాస్ ప్రభాస్‌ !!

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేసిన మోస్ట్ అవేటెడ్ మూవీనే సలార్.

ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ పార్ట్‌ 1  అంతటా సూపర్ డూపర్ రెస్పాన్స్‌ను వచ్చేలా చేసుకుంది.

ఆలోవర్ వరల్డ్ రికార్డ్‌ లెవల్‌ కలెక్షన్లను రాబడుతోంది. అంతేకాదు తాజాగా 600క్రోర్ గ్రాస్‌ దిశగా పరుగెడుతోంది.

బాలీవుడ్‌లోనూ.. కోలీవుడ్‌లోనూ.. టాలీవుడ్‌లోనూ.. ఇప్పటికే ఉన్న బాక్సాఫీస్‌ రికార్డులను బద్దలుకొడుతోంది.

అంతేకాదు డిసెంబర్ 27 ఒక్క రోజే.. మూవీ 23.50 కోట్లను కలెక్ట్ చేసింది.

సాక్ నిల్క్‌ నివేదిక ప్రకారం ఇదే రోజు... సలార్ తెలుగు మూవీ... 28.02 పర్సెంట్ యాక్యూపెన్సీని నమోదు చేసింది.