TV9 Telugu

తన నెక్స్ట్ సినిమాలపై డార్లింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!

05 January 2024

సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

ఇప్పుడు డార్లింగ్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఆరా తీయడం ఆ సినిమాల పై అంచనాలు వేయడం మొదలెట్టారు ఫ్యాన్స్‌.

అయితే అలాంటి వారికి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు రెబల్ స్టార్  ప్రభాస్‌.

తాను సినిమాలో తన యాక్టింగ్‌తో తన వరల్డ్‌ వైడ్‌ ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేయడమే తన ఎయిమ్ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పిన ప్రభాస్.

తన ఫ్యూచర్ ప్రాజెక్ట్ అయిన కల్కి, స్పిరిట్ గురించి, మారుతీ డైరెక్షన్లో చేస్తున్న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

సలార్ భారీ యాక్షన్ డ్రామా , కల్కి 2898 AD సైన్స్‌ ఫిక్షన్ , అలాగే స్పిరిట్ సినిమా చాలా వరకు ఆకట్టుకునే కథ అని..

అలాగే ప్రస్తుతం తాను హారర్ చిత్రంలో నటిస్తున్నానని తన ఫ్యూచర్ సినిమాల గురించి చెప్పారు ప్రభాస్‌.

అంతేకాదు మారుతితో తాను చేస్తున్న సినిమా హారర్ కథ అని హింట్ ఇచ్చేశాడు డార్లింగ్. దీంతో ప్రభాస్ రాబోయే సినిమాలపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.