11 September 2023

ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్

Pic credit - Instagram

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. సలార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు చేయడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.

ప్రభాస్ సినిమాలకు ఓక రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు రావడం తో ప్రభాస్ ఉన్న క్రేజ్ కు వికీపీడియా షేక్ అవుతోంది.

సలార్ మూవీకి ఏకంగా వికీపీడియాలో దాదాపు  2,68,000కు పైగా పేజ్ వ్యూస్ వచ్చాయి. ఈ స్థాయిలో పేజ్ వ్యూస్ ఈ సినిమా విషయం లోనే జరిగింది.

ఈ పేజ్ వ్యూస్ చూస్తే ప్రభాస్ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

 అప్ కమింగ్ సినిమాలు కు  కనీసం 60,000 కంటే పేజ్ వ్యూస్ రాలేదు. సరికొత్త రికార్డ్ ప్రభాస్ ఖాతాలో చేరినందుకు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.

మరోసారి 1000 కోట్లు కలెక్షన్లను సలార్ తో సాధించే  అవకాశం ఉంది అని ఈ క్రేజ్ చూస్తుంటే అర్ధం అవుతుంది.