కల్కి అకా ప్రాజెక్ట్ కె! ప్రభాస్ మోస్ట్ అవేటెడ్ మూవీగా ఇప్పటికే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ అర్థరాత్రి నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
అందుకు కారణం ఏంటంటారా? తెలిసిందే..! ఈ సినిమా నుంచి ఓ 25 సెకండ్ల వీడియో లీక్ అవ్వడమే? అందులో ప్రభాస్ డాషింగ్ లుక్స్ అందర్నీ ఫిదా చేయడమే!
ప్రాజెక్ట్ కె లీక్‌డ్ వీడియో షేరింగ్ పై తాజాగా ఈ మూవీ టీం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. దాంతో పాటే డార్లింగ్ ఫ్యాన్స్కు ఓ రిక్వెస్ట్ కూడా చేసింది. ఇప్పుడదే నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
ప్రభాస్ హీరోగా.. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీ నుంచి ఉన్నట్టుండి నిన్ని అర్థరాత్రి అంటే సెప్టెంబర్ 4న అర్థరాత్రి ఓ వీడియో క్లిప్ లీకైంది.
అందులో ప్రభాస్ అండ్ కమల్ హాసన్ కనిపించడంతో.. ఆ క్లిప్ ఓవర్ నైట్ వైలర్ అయింది. దాంతో పాటే కల్కిని మరో సారి నెట్టింట ట్రెండింగ్‌లోకి వెళ్లింది.
అయితే ఈ లీక్‌ను సీరియస్‌గా తీసుకున్న కల్కి మూవీ టీం.. ఆ లీక్‌డ్ వీడియోను వైరల్ చేస్తున్న వారికి వార్నింగ్ ఇచ్చింది.
కల్కి లీక్‌డ్ వీడియో షేర్ చేసినా.. వైరల్ చేసినా.. వారి అకౌంట్ సస్పెండ్ అయ్యేలా వార్నింగ్ ఇచ్చింది.
అవుట్ ఆఫ్ క్యూరియాసిటీతో.. ప్రభాస్ లుక్‌ను వైలర్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్‌కు దయ చేసి లీక్ అయిన ప్రభాస్ ఫోటోలను నెట్టింట షేర్ చేయొద్దంటూ రెక్వెస్ట్ చేసింది.