TV9 Telugu
విజువల్ ఫీస్ట్ కు అంతా సిద్ధం.. త్వరలోనే కల్కి టీజర్..
24 Febraury 2024
పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ సినిమా రన్ టైమ్ ఎంత? అనే విషయం మీద ఎంతో క్యూరియాసిటీ ఉంది.
కల్కి టీజర్ రన్ టైమ్ ఎంత? అనే టాపిక్ మీద కూడా అంతే ఇష్టాన్ని పెంచుకుంటున్నారు అభిమానులు, ఆడియన్స్.
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇది.
ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు రకాల వీడియో మెటీరియల్‌ని ప్రేక్షకుల కోసం రిలీజ్ చేశారు మూవీ కెప్టెన్ నాగి.
లేటెస్ట్ గా ఓ టీజర్‌ని కూడా కట్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ టీజర్ ఒక నిమిషం 23 సెకన్లు ఉంటుందన్నది లేటెస్ట్ న్యూస్.
భారీ విజువల్ ఎఫెక్ట్స్, నెవర్ బిఫోర్ సీన్ విజువల్స్ తో గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంటుందట కల్కి టీజర్.
ప్రభాస్ ఎంట్రీ సీన్‌కి నెక్స్ట్ రేంజ్ బీజీఎమ్ ఉంటుందని చెప్పారు మ్యూజిక్ డైరక్టర్ సంతోష్ నారాయణ్.
ఈ సినిమా కోసం ఆత్రుతతో వెయిట్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. మే 9న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది.