22 November 2023

మరో పాన్ ఇండియా సినిమాను లైన్లో పెట్టిన ప్రభాస్.

ప్రస్తుతం సలార్ సినిమా రిలీజ్ హడావిడిలో ఉన్న ప్రభాస్.. ఆ పనితో పాటే.. 

అటు ప్రాజెక్ట్ కె కల్కి సినిమాను.. ఇటు మారుతీ డైరెక్షన్లో రాజా డీలక్స్ సినిమాను పరిగెత్తిస్తున్నారు. 

అనుకున్న టైంలో.. అనుకున్నట్టు ఈ సినిమాలను ఫినిష్ చేయాలని కష్టపడుతున్నారు.

ఇక ఈ సినిమాల తర్వతే.. హను రాఘవపూడి డైరెక్షన్లో మరో సినిమా మొదలెట్టనున్నారట ప్రభాస్.

అందుకోసం ఇప్పటికే డైరెక్టర్ చెప్పిన కథను లాక్ చేసిన ప్రభాస్‌.. 

ఆ సినిమా ప్రీ పొడక్షన్ వర్క్‌ను కూడా మొదలెట్టమని డైరెక్టర్‌కు చెప్పారట. 

ప్రభాస్‌ క్రేజ్‌కు.. హను విజన్‌కు తగ్గట్టే... ఈ మూవీని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో.. 

ఈ మూవీని ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటుదట మైత్రీ మూవీ మేకర్స్.