ఈ సినిమా నుంచే మొదలైన ప్రభాస్ చిత్రాల వాయిదాల పర్వం..

15 September 2023

మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చారు ప్రభాస్‌. పక్కాగా చెప్పిన డేట్‌కు వస్తుందని భావించిన సలార్‌ కూడా వాయిదా పడింది.

దీంతో డార్లింగ్ సినిమా అంటే మినిమమ్‌ వన్‌ ఇయర్ డిలే తప్పదని ఫిక్స్ అవ్వాల్సిన పరిస్థితికి వచ్చింది సిచ్యుయేషన్‌.

ప్రభాస్ సినిమా ఆన్‌ టైమ్ రిలీజ్ అయి దశాబ్దాలు గడిచిపోయాయి. పాన్ ఇండియా ట్రెండ్‌లోకి ఎంటర్‌ అవ్వకముందే ప్రభాస్ సినిమాలు రెబల్‌ సినిమా దగ్గర నుంచే  డీలే అవుతున్నాయి.

రెబల్‌ అనుకున్న టైమ్‌కు రిలీజ్ కాకపోవటంతో ఆ ఎఫెక్ట్‌తో మిర్చి మీద పడింది. రీ వర్క్ చేసేందుకు టైమ్‌ తీసుకున్న మేకర్స్, మిర్చి సినిమాను ముందు చెప్పిన డేట్‌కు కాకుండా కాస్త ఆలస్యంగా విడుదల చేశారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన బాహుబలి సినిమాను ఏళ్ల తరబడి చెక్కిన జక్కన్న... రెండు భాగాలను ఆలస్యంగానే రిలీజ్‌ చేశారు. దీంతో ప్రభాస్ సినిమా అంటే డిలే తప్పదని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్‌.

బాహుబలి తరువాత యాక్షన్ జానర్‌లో తెరకెక్కిన సాహో, లవ్‌ స్టోరిగా రూపొందిన రాధేశ్యామ్ సినిమాలు కూడా దాదాపు ఏడాది పాటు వాయిదా పడిన తరువాతే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

ఆదిపురుష్ సినిమాను పక్క ప్లానింగ్‌తో చెప్పిన డేట్‌కు రిలీజ్ అవుతుంది అనుకున్న గ్రాఫిక్స్ విషయంలో కంప్లయింట్స్ రావటంతో ఈ సినిమాను కూడా ఆలస్యంగానే రిలీజ్ చేయాల్సి వచ్చింది.

ప్రభాస్‌ అప్‌ కమింగ్ సినిమాలు కూడా ఆల్రెడీ వాయిదా పడినట్టుగానే కనిపిస్తోంది. సలార్ డిలే విషయాన్ని అఫీషియల్‌గా కన్ఫార్మ్ చేశారు మేకర్స్‌.

సలార్ ఆలస్యమైతే ఆ ఎఫెక్ట్ కల్కి 2898 ఏడీ మీద కూడా పడుతుంది. సో.. ఆ సినిమా కూడా ఆలస్యమవ్వటం పక్కా అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్‌.