TV9 Telugu
గతంలో లానే కల్కి విషయంలో మళ్లీ అదే తప్పు చేస్తున్న ప్రభాస్.?
10 April 2024
ప్రభాస్ గత సినిమాల విషయంలో జరిగిన తప్పుల్నే కల్కి విషయంలోనూ రిపీట్ చేస్తున్నారా.? అనుమానపడుతున్నారు ఫ్యాన్స్.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కూడా ఎందుకింకా నిర్మాతలు సైలెన్స్‌తో కూడిన సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారు.?
ఏ విషయాన్ని ఎందుకు స్పష్టంగా చెప్పట్లేదు.? వాయిదా పడితే కొత్త డేట్ ఎప్పుడు.? పడకపోతే ప్రమోషన్స్‌లో ఆలస్యమెందుకు.?
కల్కి విషయంలో కన్ఫ్యూజన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అధికారికంగా ఈ సినిమా రిలీజ్ ఇంకా మే 9 అంటున్నారు మేకర్స్.
కల్కి రిలీజ్‌కు ఇంకా కొద్దీ రోజులే ఉంది.. మరి ప్రమోషన్స్ ఎక్కడ అంటున్నారు. ఇక్కడే నిర్మాతలపై వాళ్లు కోపంగా ఉన్నారు.
కనీసం ఒక్క అప్‌డేట్ ఇవ్వండి చాలు అంటున్నారు ఫ్యాన్స్. మరోవైపు ఎన్నికల కారణంగా సినిమాను మే 9న విడుదల చేయలేని పరిస్థితి నిర్మాతలది.
ప్రభాస్ గత సినిమాల వల్ల కల్కి పోస్ట్ పోన్ చేస్తే.. అభిమానులు ఎలా తీసుకుంటారనే భయం కూడా నిర్మాతల్లో ఉంది.
సాహో, ఆదిపురుష్ సినిమాలకు డేట్స్ వాయిదా వేసినపుడు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ బాగా జరిగాయి. అందుకే ఈ మౌనం.
ఇక్కడ క్లిక్ చెయ్యండి