ఆడి బాడి బాక్సాఫీస్ రా.. ఇదే నిజం చేస్తున్న ప్రభాస్.. నిర్మాతలు సేఫ్.

Anil Kumar

24 May 2024

ప్రభాస్‌తో సినిమా కమిటైతే చాలు నిర్మాతలు వద్దన్నా వందల కోట్లు వచ్చేస్తాయి.. టాక్‌తో పనిలేకుండా ఓపెనింగ్స్ చాలు.

తాజాగా కల్కి విషయంలోనూ ఇదే జరుగుతుంది. మరి ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ముచ్చటేంటి..? ఎంత రేట్ పలుకుతుంది..?

ఛత్రపతిలో చెప్పినట్టు.. ఆడి బాడి బాక్సాఫీస్ అని.. బాహుబలి నుంచి ప్రభాస్ సినిమాలకు కాసుల వర్షం కురుస్తుంది.

నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడిపై భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ 375 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తుంది.

పైగా అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే, కమల్ హాసన్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉండటంతో బిజినెస్ కూడా అలాగే జరుగుతుంది.

హిందీ OTT రైట్స్ 175 కోట్లకు అమ్ముడవ్వగా.. సౌత్‌లో అన్ని భాషలకు కలిపి 200 కోట్లకు కల్కి రైట్స్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ రెండు కలిపి నాన్ థియెట్రికల్‌ 375 కోట్లు వచ్చేసాయి. థియెట్రికల్ పరంగా 400 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుంది.

ఎటు చూసుకున్నా.. ప్రభాస్ అంటే తక్కువలో తక్కువ 750 కోట్లకు పైగానే బిజినెస్ జరుగుతుందన్నమాట. సో జూన్ 27న కల్కి కోసం వెయిటింగ్.