TV9 Telugu
రెట్టింపు జోరుతో కల్కి షూటింగ్.. వేణుతో నాని సినిమా..
25 Febraury 2024
నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడి షూటింగ్‌ను రెట్టింపు జోరుతో పూర్తి చేస్తున్నారు ప్రభాస్.
తాజాగా కల్కి టీం సోషల్ మీడియాలో ప్రభాస్ మూవెంట్స్ పోస్ట్ చేసారు. అందులో డాన్స్ నెంబర్ కోసం రెడీ అవుతున్నారు రెబల్ స్టార్.
ఈ సినిమాలో దిశా పటానీతో కలిసి ఓ మాస్ బీట్‌కు చిందులేయపోతున్నారు ప్రభాస్. మే 9న సినిమా విడుదల కానుంది.
ఆర్టికల్ 370 సినిమా నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అవుతుంది. గత కొన్నేళ్లుగా కశ్మీర్‌లో పరిణామాలు, రాజకీయాల నేపథ్యంలోనే తెరకెక్కించారు ఆదిత్య సుహాస్ జంభలే.
యమీ గౌతమ్, ప్రియమణి నటించిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా రావడమే కాదు.. వివాదమూ అలాగే రేగుతుంది.
బలగం లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో దర్శకుడిగా మారిన కమెడియన్ వేణు రెండో సినిమా ఖరారైనట్లే కనిపిస్తుంది.
కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజం చేస్తూ.. నానిని కలిసారు వేణు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా దిల్ రాజు బృందం నానిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
80 దశకంలో ఒక మారుమూల పల్లెటూళ్ళో ప్రేమ, ఎమోషన్లు, కక్షల నేపథ్యంలో నాని వేణు కాంబోలో సినిమా వస్తుందని తెలుస్తుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి