కల్కి ఓటీటీ రిలీజ్ పై బిగ్ ట్విస్ట్.. అప్పటిదాకా ఆగాల్సిందే

TV9 Telugu

23 June 2024

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ది మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి 2898 AD. జూన్ 27న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది

నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ లో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నారు.

వీరితో పాటు కమల్ హాసన్, దిశా పటానీ, శోభన, ఉమాపతి తదితర స్టార్లందరూ ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగం కానున్నారు.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ కల్కి సినిమాపై హడావిడి మొదలైంది. తెలంగాణలో టికెట్ రేట్ల గురించి క్లారిటీ వచ్చేసింది

ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ధరలపై టికెట్ల ధరలపై ఫుల్ క్లారిటీ రావాల్సి ఉంది. అయితే  'కల్కి' ఓటీటీ  గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కావాలనేది ముందు డీల్ సెట్ చేసుకున్నారట మేకర్స్. అది కూడా రిజల్ట్ తో సంబంధం లేకుండా.

సినిమా ఫలితం ఏదైనా సరే థియేట్రికల్ రిలీజ్ అయిన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలని ఒప్పందం కుదుర్చుకున్నారట.

కల్కి' సినిమా దక్షిణాది భాషల హక్కుల్ని అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, హిందీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థకు విక్రయించినట్లు తెలుస్తోంది