ప్రభాస్ 'కల్కి' రన్ టైమ్ ఇదే.. ఇది కూడా బాహుబలి లాగే..

TV9 Telugu

30 May 2024

ప్రభాస్‌ హీరోగా నటించిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా కల్కి 2898 AD. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె హీరోయిన్ గా నటించింది.

నాగ్‌ అశ్విన్  తెరకెక్కించిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్ , కమల్‌ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ఇతర పాత్రల్లో నటించారు.

వైజయంతీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కల్కి 2898 AD  సినిమాను నిర్మించింది.

ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ ది మోస్ట్ అవైటెడ్  సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచింది చిత్ర బృందం. రోజుకొక అప్డేట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది.

ఇదిలా ఉంటే కల్కి సినిమా రన్ టైమ్‌ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. సుమారు 3గంటల 10నిమిషాల పాటు ప్రభాస్ సినిమా రన్‌ టైమ్‌ ఉందట.

అయితే ఇది జస్ట్ కేవలం రూమర్ మాత్రమే.  కల్కి 2898 AD  సినిమా నిడివిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

అయితే సినిమా ఇండస్ట్రీ వర్గాల ప్రకారం కల్కి సినిమా రన్ టైమ్ 3గంటలకు తగ్గకుండానే ఉంటుందని సమాచారం.