TV9 Telugu

అవునా.? ఆ కారణాల వల్ల ప్రభాస్ కల్కి మూవీ వాయిదా.?

17 March 2024

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నెక్స్ట్ మూవీ కల్కి 2898 ఎ.డి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

సలార్ మూవీతో సాలిడ్ హిట్ అందుకున్న డార్లింగ్. ఇప్పడు సలార్ 2తో పాటు నాగ్ అశ్విన్ తో ఓ సినిమా చేస్తున్నారు.

భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను వైజయంతీ మూవీస్ నిర్మిస్తుంది. ఇందులో కమల్ హాసన్, బిగ్ బీ కూడా నటిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ భైరవగా కనిపించనున్నారు. ప్రభాస్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తుంది.

ఇదిలా ఉంటె కల్కి 2898 ఎ.డి సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అనే టాపిక్ నెట్టింట వైరల్ అవుతోంది.

డార్లింగ్ కల్కి 2898 ఎ.డి సినిమాను మే 9న విడుదల చేయనున్నాం అని ఇప్పటికే ఈ మూవీ టీమ్ అనౌన్స్ చేసింది. అయితే..

తాజాగా ఎలక్షన్ కమీషన్ ఎన్నికల తేదీలను ప్రకటించడంతో కల్కి 2898 ఎ.డి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కల్కి రిలీజ్ వాయిదా పడేలా ఉంది.