రిలీజ్ కు ముందే రికార్డులు బద్దలుకొడుతున్న డార్లింగ్ కల్కి 2898 AD

Anil Kumar

09 June 2024

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వస్తున్న కల్కి 2898 AD జూన్ 27 2024న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.

ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా సరే.. నిమిషాల్లో సోషల్‌ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌ అవుతోంది.

ఇక ఈ మధ్యే మొదలు పెట్టిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి అనే చెప్పాలి.

కల్కి సినిమాపై హైప్ పెంచడానికి కొత్త కొత్తగా ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారు నాగి తో పాటు ఈ మూవీ మేకర్స్.

తాజాగా ఈ చిత్రం నుంచి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు.

జూన్ 10న అనగా రేపు కల్కి 2098 AD యొక్క ట్రైలర్ అన్ని భాషల్లోనూ విడుదల కానుంది. దీనిపై ఉత్కంఠ పెరిగింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా విదేశాల్లో ఒక రోజు ముందే అంటే జూన్‌ 26 వ తేదీన విడుదల థియేటర్లలో సందడి చేయనుంది.

విదేశాల్లో ఈ మూవీ 124 లోకేషన్లలో విడుదల చేస్తుండగా.. ఇప్పటికే 116 థియేటర్లలో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ అయ్యాయి.