కల్కి కిక్‌ స్టార్ట్.. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టిన కల్కి.

Anil Kumar

12 July 2024

కల్కి ఆల్బమ్‌తో మీ రోజును కిక్‌స్టార్ట్ చేయండి అంటూ కల్కి 2898 ఏడీ ఆల్బమ్‌ని షేర్‌ చేసింది వైజయంతీ మూవీస్‌.

ప్రభాస్‌, అమితాబ్‌, కమల్‌హాసన్‌ కీలక పాత్రల్లో నటించిన కల్కి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.

నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ  సినిమాకు సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించి సాలిడ్ హిట్ అందుకున్నారు మేకర్స్.

తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన భారతీయ సినిమాగా రికార్డ్ సృష్టించింది.

కల్కి కన్నా ఈ రికార్డును సాధించిన ఇండియన్ మూవీస్ ఆరు ఉన్నాయి. ఇక ఇప్పుడు కల్కి సినిమా 7వ స్థానంలో నిలిచింది.

కల్కి సినిమా విడుదలైన 15 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

అలాగే నార్త్ అమెరికాలోనూ అరుదైన ఫీట్ ను కల్కి సొంతం చేసుకుంది. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది.

అలాగే బుక్ మై షోలో కోటికి పైగా టికెట్స్ విక్రయమైన సినిమాగా సరి కొత్త రికార్డ్ సృష్టించింది కల్కి సినిమా.