ప్రభాస్ కల్కిపై వార్త వైరల్.. చరణ్ కొత్త చిత్రం మొదలు..

TV9 Telugu

25 January 2024

రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ చిత్రం కల్కి 2898 AD.

తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఆంగ్ల భాషల్లో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

దీపికా పాడుకొనే కథానాయక. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయానున్నారు మేకర్స్.

అయితే ప్రస్తుతం కల్కి సినిమా పోస్టుపోన్ కాబోతున్నట్లు వార్త సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. దీనిపై అధికారిక ప్రకటన లేదు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో హీరోగా గేమ్ ఛేంజర్ సినిమాతో బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటె ఈ సినిమా షూటింగ్ సెట్స్ పై ఉండగానే తన తర్వాత చేయబోయే సినిమా కోసం సిద్ధం అవుతున్నారు చెర్రీ.

ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న బుచ్చిబాబుతో రామ్ చరణ్ చేయనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైంది.

ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చరణ్ రంగస్థలంకి సెట్ వర్క్స్ జరిగిన ప్రాంతంలోనే ఈ మూవీ కోసం కూడా భారీ సెట్టింగ్స్ వేస్తున్నాట్టు సమాచారం.