02 February 2024

ప్రభాస్‌కు మరో సర్జరీ ??

TV9 Telugu

‘సలార్‌’ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్‌.

‘సలార్’ డిసెంబర్ 22, 2023న విడుదలై భారీ వసూళ్లను రాబట్టింది.

థియేటర్లలోనే కాదు.. ప్రస్తుతం సలార్ సినిమా ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది.

ఇక  ‘కల్కి 2898 AD’, ‘రాజా సాబ్’ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

అయితే ఇప్పుడు ప్రభాస్ కొన్ని వారాలపాటు రెస్ట్ తీసుకోనున్నారని టాక్ వినిపిస్తుంది.

ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉందట. ప్రభాస్ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనే కొద్ది రోజులు అన్ని షూటింగ్స్‌కు బ్రేక్ ఇవ్వనున్నారట.

ఇక ప్రభాస్‌కి కొన్ని ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్నాడు. ఇటీవలే కొన్ని శస్త్ర చికిత్సలు కూడా చేయించుకున్నా.. దాని నుంచి పూర్తిగా కోలుకోలేదు.

అందుకే మరో సర్జరీ కోసం యూరప్ వెళ్లనున్నాడని ప్రచారం జరుగుతోంది.