14 December 2023

అయోమయంలో ప్రభాస్‌ ఫ్యాన్స్.. సినిమా మళ్లీ వాయిదా పడదుకదా.?

ప్రభాస్ సినిమా వస్తుందంటే..తెలియకుండానే  అందర్లో ఊపు వస్తుంది.

ఆ సినిమా పై బజ్ అమాంతంగా పెరిగిపోతుంది. హద్దులు దాటేలా ఫిల్మ్ మార్కెట్ పరిగెడుతోంది.

కానీ ఏంటో తెలియని అయోమం డార్లింగ్ ఫ్యాన్స్ను వేధిస్తోంది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్‌ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్.

రెండు పార్ట్స్‌ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫస్ట్ పార్ట్ సీజ్‌ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్‌ అవుతోంది.

అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడినా అటు ప్రభాస్‌ కానీ.. ఈ మూవీ మేకర్స్‌ కానీ ఇంకా ప్రమోషన్‌ మొదలెట్టకపోవడం..

రెబల్ స్టార్ ఫ్యాన్స్‌లో తెలియని అసహనాన్ని కలిగిస్తోంది. అయోమయానికి గురి చేస్తోంది.

సినిమా మళ్లీ పోస్ట్ పోన్ కాదుకదా అనే సందేహం కలిగిస్తోంది.