ప్రభాస్ మనసు వెన్న.. వారికి రూ. 35 లక్షల విరాళం..

TV9 Telugu

23 April 2024

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ మంచి తనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన తోటి నటీనటులను ఎంతో ప్రేమగా చూసుకుంటారాయన.

సినిమా షూటింగుల్లో తోటి నటీనటులు, క్యాస్టింగ్ సిబ్బందికి రకరకాలు పిండి వంటలు, భోజనాలు మరీ చేసుకుని తీసుకొస్తారు డార్లింగ్.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు ప్రభాస్. ఒక మంచి పని కోసం ఏకంగా రూ. 35 లక్షలు విరాళంగా ఇచ్చాడు.

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మే 4న తేదీన  డైరెక్టర్స్ డేగా జరుపుతున్నారు.

ఈసారి కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గ్రాండ్ గా ఈ వేడుకను సెలబ్రేట్ చేయనున్నారు. ఇందుకోసం అందరికీ ఆహ్వానాలు అందాయి.

ఇటీవలే ఈప్రభాస్ ను సైతం  వేడుకకు  ఆహ్వానించగా.. వస్తానని మాట ఇవ్వడంతోపాటు.. ఈ కార్యక్రమానికి రూ. 35 లక్షల విరాళాన్ని అందించారట.

ఈ విషయాన్ని తెలుగు సినిమా దర్శకుల అసోసియేషన్ ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్ గుడుంబా శంకర్ సినిమా దర్శకుడు వీర శంకర్ తెలిపారు.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, నెటిజన్లు ప్రభాస్ మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు. డార్లింగ్ ది ఎంత గొప్ప మనసోనంటూ కామెంట్లు పెడుతున్నారు.