14 July 2024

ఆ విషయంలో సౌత్ ఇండియాలోనే ఏకైక హీరో ప్రభాస్.. ఏంటంటే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

ప్రభాస్.. పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ అన్న సంగతి తెలిసిందే. దేశవిదేశాల్లో డార్లింగ్ డై హార్డ్ ఫ్యాన్స్, క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవల్లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ప్రభాస్.. ఇటీవలే కల్కితో మరో హిట్ అందుకున్నాడు.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతుంది కల్కి. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

దీంతో ప్రభాస్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. బాహుబలి మూవీ వరకు ఒకెత్తు.. ఆ తర్వాత మరో ఎత్తు అన్నట్లు ఉంది. 

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఆకట్టుకోలేకపోయాయి. 

ఇటీవలే సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. ఇప్పుడు కల్కి సినిమాతో మరోసారి బాక్సాఫీస్ సత్తా చాటాడు ప్రభాస్. 

తొలి రోజు నుంచే కల్కి సినిమా భారీ వసూళ్లు రాబడుతూ అదరగొడుతుంది. ఇప్పుడు రూ.1000 కోట్ల మైలు రాయిని దాటేసింది. 

బాహుబలి, కల్కి సినిమాలతో రెండుసార్లు రూ.1000 కోట్లు రాబట్టిన ఏకైక సౌత్ ఇండియా హీరోగా ప్రభాస్ రికార్డ్ క్రియేట్ చేశారు.