TV9 Telugu
ఇప్పటికి కుదిరిందా డార్లింగ్?
05 March 2024
హైట్ ఉన్న హీరోలు డ్యాన్సులు వేయగలరా? అని ఒకప్పుడు రకరకాల అనుమానాలు వినిపించేవి. కానీ ప్రభాస్ మాత్రం అద్భుతంగా డ్యాన్సులు చేసేవారు.
ప్రభాస్‌కి యాక్షన్ హీరోగా ఇండస్ట్రీలో ఎంత పేరుందో, ఆయన చేసే డ్యాన్సులను ఇష్టపడేవారు కూడా అంత మందే ఉన్నారు.
అప్పుడెప్పుడో చేసిన మిర్చి మూవీ తర్వాత వచ్చిన సినిమాల్లో స్టెప్పులేసే ఛాన్సులు ప్రభాస్‌కి పెద్దగా రాలేదు.
ఇప్పుడు కల్కిలో నటిస్తున్నారు ప్రభాస్. దిశా పటాని, ప్రభాస్ ప్రస్తుతం ఇటలీలోని సార్డినియా ద్వీపంలో ఓ పాట షూటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు.
ప్రభాస్‌తో పాటు, దిశకు కూడా మంచి డ్యాన్సర్‌గా పేరుంది. ఈ పాటలో డ్యాన్సులు స్పెషల్‌గా ఉండేలా డిజైన్ చేయించారట నాగ్ అశ్విన్.
సినిమాలో ఈ పాటని నెక్స్ట్ లెవల్లో ఎక్స్ పెక్ట్ చేయొచ్చనే టాలీవుడ్ ఫిలిం సర్కిల్స్ లో మాటలు వినిపిస్తున్నాయి.
ఆల్రెడీ ప్రభాస్ - దీపిక మీద కూడా ఓ పాటను చిత్రీకరించింది యూనిట్. వచ్చే నెల నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లు స్పీడందుకుంటాయనే టాక్ ఉంది.
సైన్స్ ఫిక్షన్ గా కల్కి 2898 AD చిత్రం కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆశక్తిగా చూస్తున్న. మే 9న ఇది విడుదల కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి