కన్నప్ప కోసం డార్లింగ్ కాల్షీట్లు.. ముఖ్యమంత్రితో దిల్ రాజు భేటీ..

TV9 Telugu

30 January 2024

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘క‌న్న‌ప్ప‌’లో ప్ర‌భాస్ శివుని పాత్ర పోషిస్తున్నారని ఇదివరకే తెలిపారు దర్శక నిర్మాతలు.

ఇప్పుడు ‘క‌న్న‌ప్ప‌’ సెట్లో అడుగు పెట్ట‌డానికి డార్లింగ్ కూడా రెడీ అయ్యారు. దీనికోసం త‌న కాల్షీట్లు ఖ‌రారు చేశారు.

ఫిబ్ర‌వ‌రి 17, 18, 19 తేదీల‌ను పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ‘క‌న్న‌ప్ప‌’ షూటింగ్ కోసం కేటాయించారని తెలుస్తుంది.

న్యూజిలాండ్‌లోనే ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం జరుగుతుంది. ప్రభస్ పాత్రకు సంబందించిన షూట్ కూడా అక్కడ జరగనుందని సమాచారం.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కొందరు తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులు కలిశారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం పదవిని అధిరోహించిన రేవంత్ రెడ్డిని అభినందించారు.

తాజాగా తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు దిల్ రాజు, నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్ ఆయనను కలిశారు.

దామోదర ప్రసాద్ సహా మరికొందరు సిఎం నివాసానికి వెళ్లి పుష్పగుచ్చం రేవంత్ రెడ్డికి అందించారు. తర్వాత ఆయతో మాట్లాడారు.