సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు పూనమ్ పాండే తాను చనిపోయానని చెప్పి షాక్ ఇచ్చారు.
తన మరణానికి సంబంధించిన తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. దాంతో పూనమ్ ప్రజల నుంచి విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది.
సోషల్ మీడియా యూజర్స్ మాత్రమే కాదు చాలా మంది సెలబ్రిటీలు పూనమ్ పాండేపై చాలా విమర్శలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం తర్వాత ఆమె పై కేసు కూడా నమోదైంది.
అయితే ఇటీవల ఆమె తనసోషల్ మీడియా ఖాతా నుండి గర్భాశయ క్యాన్సర్‌కు సంబంధించిన అన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను తొలగించడంతో పూనమ్ ఎక్కువగా ట్రోల్ గురైంది.
"నిజాయితీగా చెప్పాలంటే, నా పోస్ట్ వల్ల చాలా మందికి సర్వైకల్ క్యాన్సర్ గురించి తెలిసిందని నేను సంతోషిస్తున్నాను. నా పోస్ట్ చాలా మందికి చేరాలని నా లక్ష్యం.
అయితే ఇందుకు ఒప్పించిన వాళ్లు కొందరు.. తన చర్చతో ఆర్థికంగా ప్రయోజనం పొందారు. డబ్బు సంపాదిస్తున్నారు. అందుకు నాకు బాధగా ఉంది" అని రాసుకొచ్చింది పూనమ్.
మంచి సోషల్ వర్క్‌ని ఎవరు కమర్షియల్‌గా చేశారో ఇప్పుడు మీరంతా కనుక్కోవాలి అని ఆమే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తనను ఇందులోకి లాగి బలిపశువు చేశారన్నట్టుగా తన పోస్ట్‌లో ఎక్స్‌ప్రెస్ చేశారు.