అందుకే ఆలా చేశానన్న పూనమ్.. ముఖ్య గమనిక ట్రైలర్..

TV9 Telugu

05 February  2024

సోషల్ మీడియా సెన్సేషన్.. బాలీవుడ్ ఇండస్ట్రీ కాంట్రవర్సియల్ హీరోయిన్ పూనమ్ పాండే మరణించ లేదు.. బతికే ఉన్నారు.

ఇటీవల ఆమె చనిపోయిందని సోషల్ మీడియాలో పూనమ్ పాండే మేనేజర్ పోస్ట్ చేయడంతో దేశమంతా ఆ విషయాన్ని నమ్మారు.

అయితే ఇది జరిగిన ఒకరోజు తర్వాత సోషల్ మీడియా ద్వారా ఓ వీడియో విడుదల చేసారు బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే.

గర్భాశయ కాన్సర్ అవేర్‌నెస్ కోసమే తాను ఇలా చేసినట్లు చెప్పారు. ఎవరైనా హర్ట్ అయ్యుంటే క్షమించాలని కోరారు పూనమ్.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బావమరిది విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా టాలీవుడ్ కి పరిచయమవుతున్న చిత్రం ముఖ్య గమనిక.

వేణు మురళీధర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు అమ్మాయి లావణ్య ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తుంది.

తాజాగా ముఖ్య గమనిక సినిమా ట్రైలర్ విడుదల చేసారు మూవీ మేకర్స్. రాజశేఖర్ లోకం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఫిబ్రవరి 23న ముఖ్య గమనిక సినిమా థియేటర్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు దర్శక నిర్మాతలు.