క్యూట్ ఫొటోస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూనమ్ బజ్వా

TV9 Telugu

26 June 2024

పూనమ్ బజ్వా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.. 'మొదటి సినిమా'తో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ.

పూనమ్ బజ్వా నటించిన ఈ సినిమా వచ్చి దాదాపుగా 19 ఏళ్ళు అవుతుంది. ఈ మూవీ లో చాలా క్యూట్ గా అందంగా కనిపించింది ఈ చిన్నది.

ఆ తరువాత ప్రేమంటే ఇంతే, నాగార్జున హీరో గా నటించిన బాస్, వేడుక పరుగు వంటి మొదలగు సినిమాల్లో కనిపించి తన నటనతో అందరిని మెప్పించింది.

ఈ ముద్దగుమ్మ నటించిన చివరి సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు’ మూవీలో కనిపించింది. ఈ చిన్నది తెలుగులో కంటే తమిళ సినిమాలో ఎక్కువ నటించింది.

మొదటి లో కధకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వచ్చిన తరువాత చాలా చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైంది. అయితే పూనమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టీవ్‌ అవుతుంది.

ట్రెండీ డ్రెస్సులతో.. ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీనితో ఆమెకు ఫాలోవర్లు కూడా పెరిగారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టి దిగిన ఫోటోస్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా నెట్టింట వైరల్ గా మారాయి.