ఛాలెంజిగ్ రోల్ లో పూజా హెగ్డే.. ఈసారి హిట్ పక్కా అంటున్న ఫ్యాన్
Rajeev
Pic credit - Instagram
తెలుగు సినీపరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది క్రేజీ బ్యూటీ పూజా హెగ్డే.
తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆకట్టుకుంది ఈ చిన్నది. ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్స్ అందుకుంది
దీంతో నెమ్మదిగా ఆమె క్రేజ్ తగ్గిపోయింది. అదే సమయంలో పూజా సైతం తనవరకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదిలేసుకుంది.
తెలుగు, హిందీ, తమిళం భాషలలో ఏ ఒక్క సినిమా చేయకుండా ఇండస్ట్రీలో యాక్టివ్ గా లేదు. చివరిగా ఓ హిందీ సినిమా చేసింది.
షాహిద్ కపూర్ హీరోగా నటించిన దేవా సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది.
ఇక ఇప్పుడు సూర్య రెట్రో సినిమాలో చేస్తుంది. అలాగే లారెన్స్ హీరోగా నటిస్తున్న కాంచన 4లోనూ నటిస్తుంది. అయితే ఈ సినిమాలో పూజా దెయ్యంగా కనిపించనుందని టాక్.