19 October 2025

వరుస ప్లాపులతో సతమతం.. కట్ చేస్తే.. నాని సరసన ఛాన్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. స్టార్ హీరోలతో అనేక హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ... కొన్నాళ్లుగా వరుస ప్లాపులతో సతమతమవుతుంది.

కానీ ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని సరసన క్రేజీ ఛాన్స్ కొట్టేసింది. ఇంతకీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరమీదకు రాబోతున్న ఆ కొత్త జోడీ ఎవరో తెలుసుకుందామా.

ఇటీవల ఓజీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో నాని కొత్త సినిమా చేస్తున్నారు. తాజాగా ఇందులోకి టాలీవుడ్ హీరోయిన్ సెలక్ట్ చేశారట.

పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పృధ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో నటిస్తున్నట్లు టాక్. అలాగే ఇందులో పూజా హెగ్డే కథానాయికగా కనిపించనుందట.

కొన్నాళ్లుగా పూజా హెగ్డే వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ అమ్మడు.. టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ భామ.. ఇప్పుడిప్పుడే తిరిగి అవకాశాలు అందుకుంటుంది.

 ప్రస్తుతం ఈ అమ్మడు.. దుల్కర్ సల్మాన్ సరసన ఓ తెలుగు సినిమాలో నటిస్తుంది. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు మరో ఛాన్స్ కొట్టేసింది.

కొంతకాలంగా సరైన హిట్స్ లేక తెలుగు సినీ పరిశ్రమకు దూరమైన పూజా.. ఇప్పుడు తెలుగులో వరుసగా మంచి ప్రాజెక్టులు సొంతం చేసుకుంటూ ఫాంలోకి రాబోతుంది.

ఇప్పుడు నానితో మొదటిసారి జోడి కట్టనుంది ఈ వయ్యారి. వీరి కాంబోలో రాబోయే సినిమాకు బ్లడీ రోమియో అనే టైటిల్ ఫిక్స్ చేస్తున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.