దేవరతో బుట్టబొమ్మ స్పెషల్ సాంగ్.. ఎన్టీఆర్‌కు సరైన పోటీ..
Rajitha Chanti
Pic credit - Instagram
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది పూజా హెగ్డే. కానీ చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఈ బ్యూటీ నటించిన చిత్రాలు వరుసగా డిజాస్టర్స్ కావడంతో.. నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. అలాగే అనుహ్యంగా ఒకే చేసిన సినిమాల నుంచి తప్పుకుంది.
తెలుగు సినిమాల్లో పూజా కనిపించి చాలా కాలమైంది. అటు హిందీ, తమిళంలోనూ ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ వస్తున్నట్లు లేదు. తాజాగా క్రేజీ ప్రాజెక్ట్ ఓకే చేసింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది. కానీ ఫుల్ లెంగ్త్ రోల్ కాదండి.
లేటేస్ట్ అప్డేట్ ప్రకారం దేవర సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంటుందని.. ఇందులో తారక్ సరసన స్టెప్పులేసేందుకు పూజా ఓకే చెప్పినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది.
గతంలో వీరిద్దరి కాంబోలో అరవింద సమేత సినిమాలో నటించచారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరి జోడి అలరించనుంది.
దేవర చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే స్పెషల్ సాంగ్ చేయడం పూజాకు ఇది మొదటి సారి కాదు. గతంలో చరణ్ సరసన స్టెప్పులేసింది.
సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో చరణ్‌తో కలిసి స్పెషల్ సాంగ్ చేసింది పూజా. ప్రస్తుతం ఈ బ్యూటీ పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి.