ఈ బ్యూటీ తన సొగసుతో అందానికే చెమటలు పట్టిస్తుంది..

Rajeev 

04 June 2024

పొడుగుకాళ్ల సుందరి పూజాహెగ్డేకు ప్రస్తుతం బ్యాడ్ టై రన్ అవుతుంది. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి.

తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే.

బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది.

వరుసగా హిట్స్ అందుకున్న పూజా.. ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకుంది ఈ చిన్నది.

తెలుగు, తమిళ్, హిందీ అన్ని భాషల్లో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకుంది ఈ చిన్నది

తాజాగా కోలీవుడ్ లో క్రేజీ ఆఫర్ అనుకుంది ఈ అమ్మడు. సూర్య 44వ చిత్రంలో పూజా హీరోయిన్ గా మారింది.