వంద కోట్ల దెయ్యం సినిమాలో పూజా హెగ్డే.. హీరో ఎవరో తెలుసా?

11 September 2024

Basha Shek

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోలతో కలిసి పలు హిట్ సినిమాల్లో నటించింది.

కొన్ని నెలల క్రితం వరకు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన పూజా హెగ్డే ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది.

కెరీర్ ప్రారంభంలో ఎలా అయితే ఆమె నటించిన సినిమాలన్నీ బోల్తా పడ్డాయో ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.

దళపతి విజయ్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నా విజయం మాత్రం అందడం లేదు ఈ బ్యూటీకి.

అయితే ఇటీవల పూజా హెగ్డేకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో ప్రధాన  కథానాయికగా  ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

ఇప్పుడు రాఘవ లారెన్స్ తెరకెక్కిస్తోన్న ‘హంటర్’ అనే మూవీ లోనూ బుట్టబొమ్మకు మెయిన్ హీరోయిన్ గా అవకాశం వచ్చింది.

రాఘవ లారెన్స్ తెరకెక్కించిన సూపర్ హిట్ ఫ్రాంచైజీ  కాంఛనలో భాగంగా ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోందని సమాచారం

బాలీవుడ్ కు చెందిన గోల్డ్ మైన్ అనే నిర్మాణ సంస్థ సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది