TV9 Telugu

05 February 2024

బుట్టబొమ్మ ఈజ్‌ బ్యాక్‌.. స్టార్‌ హీరో సినిమాలో పూజా

మహర్షి, అరవింద సమేత, అల వైకుంఠపురము ఇలా బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లతో  స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది పూజా హెగ్డే.

అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు పూర్తిగా నిరాశపర్చాయి. అందులో స్టార్‌ హీరోల సినిమాలు కూడా ఉన్నాయి

దీంతో పూజా హెగ్డేకు సినిమా ఛాన్సులు కరువయ్యాయి. పూర్తిగా ఇంటికే పరిమితమైపోయిందీ బుట్టబొమ్మ

ఇక పూజా హెగ్డే పాప సినిమా కెరీర్ అయిపోయినట్లేనని చాలామంది ఒక అభిప్రాయానికి వచ్చేశారు.

అయితే  ఇలాంటి తరుణంలో ఓ తమిళ స్టార్‌ హీరో సినిమాలో హీరోయిన్‌గా పూజాహెగ్డేకు అవకాశం వచ్చింది

స్టార్‌ హీరో శింబు పెరియర్‌ స్వామి దర్శకత్వంలో ఓ పీరియాడికల్‌ మూవీ చేస్తున్నారు. కమల్‌ హాసన్‌ నిర్మాత.

ఈ క్రేజీ ప్రాజెక్టులో దీపికా పదుకొణె, కీర్తి సురేశ్‌ కథానాయికలుగా నటిస్తారని ముందుగా ప్రచారం సాగింది.

అయితే దీపికా ప్లేసులో ఇప్పుడు పూజా హెగ్డేకు అవకాశం దక్కినట్లు కోలీవుడ్‌ మీడియాలో టాక్ నడుస్తోంది.