పూజకి అంత ధైర్యం ఎక్కడిది?

TV9 Telugu

08 March 2024

మనిషన్నాక ఎప్పుడో ఒకసారి కచ్చితంగా డీమోటివేట్‌ అవుతారు. అందులోనూ గ్లామర్‌ రంగంలో అది మరీ ఎక్కువగా ఉంటుంది.

సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సక్సెస్‌ జనాలను పోగేస్తే, ఫెయిల్యూర్‌ మాత్రం ఒంటరితనాన్ని టేస్ట్ చేయమంటుంది.

మరి డీమోటివేట్‌ కాకుండా అలాంటప్పుడు కాపాడే విషయాలేంటని అడిగితే... చాలా విషయాలనే చెప్పారు పూజా హెగ్డే.

ఎవరైనా పూజా హెగ్డేని చూసి... 'పాపం' అంటే తట్టుకోలేరట. ఆలా చేస్తే చాలా కోపం వస్తుందట టాలీవుడ్ బుట్టబొమ్మకి.

సానుభూతి చూపించేవారికి దూరంగా ఉంటానని అంటున్నారు పూజ. తన కుటుంబసభ్యులు ఎప్పుడూ వారియర్‌ తరహా స్పిరిట్‌తో ఉంటారని అన్నారు.

పడ్డంత వేగంగా లేవాలన్న విషయాన్ని తన తండ్రి పదే పదే చెబుతుంటారని గుర్తుచేసుకున్నారు హీరోయిన్ పూజ హెగ్డే.

పని మీద శ్రద్ధ, ఇష్టం, కష్టపడి పని చేసే తత్వం, రుణపడి ఉండే నైజం ఉన్నవారిని భగవంతుడు ఎప్పుడూ కాపాడుతూ ఉంటాడట.

కొన్ని విషయాలను తన తల్లి డీల్‌ చేసే విధానం చూస్తే, సెల్ప్‌ డెవలప్‌మెంట్‌ క్లాస్‌కి వెళ్లినంత రిఫ్రెషింగ్‌గా ఉంటుందని అన్నారు పూజా మేడమ్‌.