TV9 Telugu

బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్.. సమంత ప్లేస్‌ను కొట్టేసిందిగా..!

18 March 2024

ఒకప్పుడు స్టార్ హీరోయిన్‏గా ఒక వెలుగు వెలిగిన బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది.

చాలా రోజులుగా ఏ ప్రాజెక్ట్ అనౌన్స్ చెయ్యలేకపోవడంతో ఇక పూజా కెరీర్ క్లోజ్ అయ్యిందంటూ ప్రచారం నడిచింది.

అయితే ఈ రూమర్స్ పై పూజా కూడా స్పందించలేదు. తాజాగా పూజాకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట బాగా వైరలవుతుంది.

టాలీవుడ్ లో బుట్టబొమ్మ ఈజ్ బ్యాక్ అనే టాక్ వినిపిస్తుంది. తెలుగులో మళ్లీ పూజాకు ఆఫర్స్ వస్తున్నాయని టాక్.

తాజాగా పూజాకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందట.! నందినిరెడ్డి డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ ఓ మూవీ చేస్తూన్నరు.

అయితే ఈ సినిమాలో సామ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఇప్పుడు సమంత ప్లేస్ లో పూజాను తీసుకున్నారని టాక్.

ప్రెజెంట్ సామ్ హెల్త్ పై శ్రద్ధ పెట్టడంతో.. ఆ స్థానానికి పూజా సరిగ్గా సెట్ అవుతుందని ఇలా చేసారు అంట మేకర్స్.

అందుకే పూజను సంప్రదించారని, పూజా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.