07 May 2025

ఏంటీ.. రెట్రో సినిమాకు పూజా రెమ్యునరేషన్ అంతేనా.. ? ఎన్ని కోట్లంటే.. 

Rajitha Chanti

Pic credit - Instagram

గత కొన్నాళ్లుగా వరుస పరాజయాలతో సతమతమవుతుంది హీరోయిన్ పూజా హెగ్డే. దీంతో కొన్ని నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ అమ్మడు. 

చాలా కాలం తర్వాత పూజాహెగ్డే నటించిన లేటేస్ట్ మూవీ రెట్రో. కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చింది. 

భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో రెట్రో సినిమాపై ఆశలన్నీ పెట్టుకున్న పూజాకు నిరాశే ఎదురైంది. 

నిజానికి పూజాకు తమిళంలో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇదివరకే తమిళంలోని స్టార్ హీరోలతో కలిసి అనేక హిట్ చిత్రాల్లో నటించింది ఈ అమ్మడు. 

ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంతోపాటు విజయ్ దళపతి నటిస్తోన్న జననాయగన్ చిత్రంలోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తూ బిజీగా ఉంది. 

ప్రస్తుతం థియేటర్లలో పాజిటివ్ టాక్ తోపాటు నెమ్మదిగా మంచి వసూళ్లు రాబడుతుంది రెట్రో మూవీ. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే, సూర్య యాక్టింగ్, కెమిస్ట్రీ బాగుందంటూ ప్రశంసలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం వీరిద్దరి రెమ్యునరేషన్ ఎంతో తెలిసిపోయింది. 

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాకు సూర్య రూ.40 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నాడట. ఇక పూజా హెగ్డే రూ.5 కోట్లు తీసుకుందని సమాచారం.