బుట్టబొమ్మ.. ఈ ఎదురుచూపులు ఇంకెన్నాళ్లమ్మ..?

Rajeev 

31 AUG 2024

పూజా హెగ్డే.. టాలీవుడ్ బుట్ట బొమ్మ.. ఆచార్య తర్వాత పూజా హెగ్డే తెలుగులో కనిపించట్లేదు. ఈ అమ్మడి చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. 

చేసిన సినిమాలన్నీ వరుసగా నిరాశపరచడంతో పూజా ఇప్పుడు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. పాన్ ఇండియా హీరోయిన్ గా చేసిన హిట్ కొట్టలేకపోయింది.

తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో వరుసగా బడా హీరోల సినిమాల్లో నటించింది కానీ ఈ మూడు భాషల్లో ఫ్లాప్స్ అందుకుంది. 

పైగా మహేష్ బాబు నటించిన గుంటూరు కారం అవకాశం మిస్ అయ్యింది. అలాగే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మిస్ చేసుకుంది. 

ఈ అమ్మడి చేతిలో ఉన్న అవకాశాలు లాగేసుకుంటున్నారు కొత్త భామలు.. కుర్ర హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 

కానీ పూజా ఇంకా ఒక్క సినిమా కూడా ఓకే చేయలేదు. దాంతో ఈ భామ గోల్డెన్ టైమ్ క్లైమాక్స్‌కు చేరుకున్నట్లేనా..? అనే అనుమానాలు వస్తున్నాయి. 

సినిమాల సంగతి పక్కన పెట్టిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటోంది.