అందం ఈ భామతో పోటీ పడితే ఈమెదే మొదటి స్థానం..

TV9 Telugu

01 February  2024

13 అక్టోబర్ 1990న మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో పుట్టి పెరిగింది టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే.

ఆమె తల్లిదండ్రులు మంజునాథ్ హెగ్డే మరియు లతా హెగ్డే. వీరిది కర్ణాటకలోని ఉడిపికి చెందిన తుళు మాట్లాడే బంట్ కుటుంబం.

ఈ ముద్దుగుమ్మకి రిషబ్ హెగ్డే అనే ఓ అన్నయ్య కూడా ఉన్నాడు. అయన ఆర్థోపెడిక్ సర్జన్ గా పని చేస్తున్నారు.

తుళుతో పాటు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషలు మాట్లాడుతుంది. ఆ తర్వాత తన సినీ కెరీర్‌లో తెలుగు నేర్చుకుంది ఈ బ్యూటీ.

ముంబై నగరంలోని మానెక్‌జీ కూపర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించింది ఈ వయ్యారి భామ.

ముంబైలోని M. M. K. కాలేజీకి డిగ్రీ చేస్తున్న సమయంలో డ్యాన్స్ తో పాటు ఫ్యాషన్ షోలలో పాల్గొనేది ఈ అందాల భామ.

మిస్ ఇండియా 2009 పోటీలో హెగ్డే పోటీ పడింది. మిస్ ఇండియా టాలెంటెడ్ 2009 గౌరవాన్ని గెలుచుకున్నప్పటికీ తొలి రౌండ్‌లోనే ఎలిమినేట్ అయింది.

తర్వాత 2010లో మిస్ యూనివర్స్ ఇండియా 2010 పోటీలో పాల్గొంది. ఇందులో రెండవ రన్నరప్‌గా నిలిచింది ఈ వయ్యారి.