పూజ పాపకు మళ్లీ టైమ్ వచ్చింది.. ఆ స్టార్ హీరోతో బుట్టబొమ్మ

TV9 Telugu

03 June 2024

ఒకప్పుడు స్టార్ హీరోలతో పలు హిట్ సినిమాల్లో నటించింది పూజా హెగ్డే. అయితే ఆ తర్వాత ఉన్నట్లుండి ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ ప్లాఫ్ అయ్యాయి.

దీంతో పూజకు సినిమా అవకాశాలు కూడా కరువయ్యాయి. ఆ మధ్యన ఒక సౌతిండియన్ స్టార్ హీరోతో మూవీలో ఛాన్స్ వచ్చినా రూమర్ గానే మిగిలిపోయింది.

ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఒకే ఒక్క హిందీ సినిమా ఉంది. అయితే ఇప్పుడీ అందాల తారకు ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని సమాచారం.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా సినిమాలో నటిస్తున్నాడు. దీని తర్వాత కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు.

యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నారని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది

కాగా ఇందులో సూర్యతో నటించే హీరోయిన్ ఎవరన్న సస్పెన్స్‌ కు తెరపడినట్లు తెలుస్తోంది. పూజా పాపకే ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు టాక్ నడిచింది.

సూర్య- కార్తీక్ సుబ్బరాజు సినిమాలో పూజా హెగ్డే  కథానాయకిగా నటిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడీ రూమర్లను నిజం చేస్తూ సూర్య సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.