01 May 2024
సినిమాలు లేకున్న తగ్గేదే లే.. రెమ్యునరేషన్ పెంచేసిన బుట్టబొమ్మ..
Rajitha Chanti
Pic credit - Instagram
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. తెలుగులోని స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది.
2014లో నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇప్పుడు ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టినట్లు టాక్.
దీంతో కొన్నాళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అంతేకాకుండా అప్పటికే ఒప్పుకున్న తెలుగు సినిమాల నుంచి కూడా తప్పుకుంది పూజా హెగ్డే.
అయితే అటు హిందీలోనూ ఆఫర్స్ రాకపోవడంతో సైలెంట్ అయ్యింది పూజా. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ యాక్టివ్ అయ్యింది.
తాజాగా ఈ బ్యూటీ మరోసారి చైతూ సరసన కనిపించనుందని టాక్. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు మూవీకి పూజా ఓకే చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది.
విరూపాక్ష సినిమాతో మంచి విజయం అందుకున్న డైరెక్టర్ కార్తీక్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారట. ఇందులో పూజా మెయిన్ లీడ్ రోల్.
అయితే సియాసత్ నివేదిక ప్రకారం పూజా హెగ్డే ఇప్పుడు రెమ్యునరేషన్ భారీగా పెంచిందని సమాచారం. ఈ సినిమాకు రూ. 5 కోట్లు తీసుకుంటదట.
మొదటి కంటే ఇప్పుడు సినిమాలు తగ్గినా రెమ్యునరేషన్ మాత్రం భారీగా పెంచేసిందని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఇప్పటివరకు క్లారిటీ మాత్రం రాలేదు.
ఇక్కడ క్లిక్ చేయండి.