24 October 2025

వరుస ప్లాపులు. అయినా తగ్గేదేలే.. పూజా హెగ్డే దిమ్మతిరిగే రెమ్యునరేషన్

Rajitha Chanti

Pic credit - Instagram

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్ పూజా హెగ్డే. తెలుగు, తమిళం భాషలలో దాదాపు స్టార్ హీరోస్ అందరి సరసన నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది.

కానీ కొన్నాళ్లుగా ఈ బ్యూటీకి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఈ బ్యూటీ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవుతున్నాయి. అయినప్పటికీ ఈ బ్యూటీకి వరు ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.

ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది పూజా హెగ్డే. ఇటీవలే మరో ఆఫర్ అందుకుందట. అల్లు అర్జున్, అట్లీ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్. 

ప్రస్తుతం ఈ బ్యూటీ మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ పై ఓ లవ్ స్టోరీని నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేశారట

అయితే ఈ సినిమా కోసం పూజా హెగ్డే భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్. తనకు వరుస ప్లాపులు ఉన్నప్పటికీ సౌత్ ఇండస్ట్రీలో మాత్రం ఆమెకు క్రేజ్ తగ్గడం లేదు. 

 దీంతో దుల్కర్ సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా రూ.3 కోట్లు పారితోషికం డిమాండ్ చేసిందని టాక్. ఇప్పుడు ఇదే విషయం దక్షిణాది చిత్రపరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది.

 ఇదే కాకుండా ప్రస్తుతం విజయ్ దళపతి హీరోగా నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్ మూవీలోనూ నటిస్తుంది. అలాగే కాంచన 5, హై జవానీ తో ఇష్క్ హోనా హై చిత్రాల్లో నటిస్తుంది.

అలాగే ఇప్పుడు అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ ప్రాజెక్టులో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్ చేయనుందట.  ఈ పాట కోసం రూ.5 కోట్లు తీసుకుంటుందని టాక్.