పూజా హెగ్డే ఆస్తుల వివరాలు తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే 

TV9 Telugu

14 March 2024

పూజా హెగ్డే గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కథానాయికగా టాలీవుడ్ లో  తన హవా నడిపించింది.

నిన్న మొన్నటి వరకు పూజా హెగ్డే యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. తర్వాత వరుస ఫ్లాపుల వల్ల ఐరన్ లెగ్ ముద్ర వేసారు.

పూజా హెగ్డే కు వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో మహేష్ బాబు 'గుంటూరు కారం'లో ముందుగా ఈ భామను తీసుకొని తొలిగించారు.

ప్రస్తుతం చేతిలో సరైన ఆఫర్స్ లేక ఫోటో షూట్స్‌ను నమ్ముకుంది. ఐతే ఇన్నేళ్ల కెరీర్‌లో ఈమె తనకు వచ్చిన రెమ్యునరేషన్స్‌తో బాగానే కూడబెట్టినట్టు సమాచారం.

పూజ ఒక్కో సినిమాకు నిన్న మొన్నటి వరకు రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

 ముంబైలో అత్యంత ఖరీదైన ప్రాంతమైన బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ సముద్రతీరంలో కోట్లలో విలువ చేసే త్రిబుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ తీసుకుంది.

మొత్తంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబైలలో అన్ని ప్రాపర్టీస్ కలిపి దాదాపు రూ. 150 కోట్ల మార్కెట్ విలువ ఉంటుందని సమాచారం.