TV9 Telugu
పోచెర్ కి అద్భుతమైన రెస్పాన్స్.. సంతోష్ శివన్‌కు అరుదైన గౌరవం..
27 Febraury 2024
నిమిషా సజయన్, రోషన్ మ్యాథ్యూ, దివ్యేందు భట్టాచార్య కీలక పాత్రల్లో రిచి మెహతా తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ పోచెర్.
ఏనుగు దంతాల నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కింది. ఫిబ్రవరి 23 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది పోచెర్.
భారీ బడ్జెట్‌తో ఈ వెబ్ సిరీస్ నిర్మించారు నిర్మాతలు. ఈ వెబ్ సిరీస్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
ఈ సిరీస్‌లోని మొదటి మూడు ఎపిసోడ్‌లు 2023 సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడ్డాయి. అక్కడ కూడా దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది.
ప్రముఖ మలయాళీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన నటుడుగా కూడా పని చేస్తున్నారు.
ప్రతిష్టాత్మక పియర్ ఏంజెనీ అవార్డుకు ఎంపిక అయ్యారు సినిమాటోగ్రాఫర్, నిర్మాత, దర్శకుడు సంతోష్ శివన్.
77వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ఈ అవార్డును అందజేయబోతున్నారు. ఈ ఏడాది మే 14 నుంచి 25 వరకు ఈ వేడుక జరగనుంది.
రెట్రో ఫోకస్, మోడ్రన్ లెన్స్‌ను కనుగొన్న ఫ్రెంచ్ సైంటిస్ట్ పియర్ ఏంజెనీకి నివాళిగా ఈ అవార్డును అందిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి