చైతూకి ఏం అర్థం అయింది?

TV9 Telugu

24 March 2024

మండుటెండలో కళ్ల ముందు మినియేచర్‌ పెట్టి, సీన్‌ ఎక్స్ ప్లెయిన్‌ చేస్తున్నారు తండేల్ దర్శకుడు చందు మొండేటి.

ఆయన చెప్పిన దాన్ని ఏమి మాట్లాడకుండా శ్రద్ధతో సీరియస్‌గా వింటున్నారు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.

మరోవైపు తండేల్ సినిమాలో కథానాయకిగా నటిస్తున్న నటి సాయిపల్లవి మాత్రం సెట్లో చిన్న పాపతో ఆడుకుంటున్నారు.

ఇవన్నీ నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ తండేల్‌ స్పాట్‌లో కనిపించిన దృశ్యాలు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ లవ్‌స్టోరీ తర్వాత అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి కలిసి నటిస్తున్న సినిమా తండేల్‌.

కార్తికేయ సీక్వెల్‌ పాన్ ఇండియా రేంజ్ సక్సెస్‌ తర్వాత ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ చందు మొండేటి.

నాగచైతన్య, సాయిపల్లవి ఇద్దరూ డీ గ్లామర్‌ లుక్స్ లో కనిపిస్తున్నారు ఈ మూవీలో. సముద్రం నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఇది.

ప్రేమ, దేశభక్తి, జాలర్ల వెతలు వంటి అంశాలతో తెరకెక్కుతున్న సినిమా తండేల్‌. రా అండ్‌ రస్టిక్‌ లవ్‌స్టోరీగా ఎలివేట్‌ అవుతోంది.