27 September 2025
10 సినిమాలు ప్లాప్.. రెండే హిట్స్.. బ్యూటీకి కలిసిరాని అదృష్టం..
Rajitha Chanti
Pic credit - Instagram
సినీరంగంలో ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఆ తర్వాత సరైన బ్రేక్ కోసం వెయిట్ చేసే హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.
అలాంటి వారిలో ఈ హీరోయిన్ ఒకరు. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఆఫర్స్ కోసం చూస్తుంది.
మొత్తం పన్నెండు సినిమాల్లో నటిస్తే.. అందులో రెండు మాత్రమే హిట్టయ్యాయి. నెట్టింట క్రేజ్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదు.
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది.
తొలి చిత్రంలోనే రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది. మొదటి సినిమా హిట్టైనా ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యాయి.
తెలుగులో ఎన్టీఆర్: కథానాయకుడు, RDXలవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, మంగళవారం వంటి చిత్రాల్లో నటించి నటిగా మార్కులు కొట్టేసింది.
తెలుగుతోపాటు కన్నడ, పంజాబీ చిత్రాల్లో నటించింది. అక్కడ కూడా అంతగా అవకాశాలు రాలేదు. కానీ ప్రస్తుతం నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.
తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. గ్లామర్ ఫోటోషూట్లతో నెట్టింట కుర్రకారును కవ్విస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్