అందంలో మన్మధుని మరదలిలా ఆకట్టుకుంటున్న పాయల్..
26 October 2023
5 డిసెంబర్ 1992న దేశ రాజధాని ఢిల్లీలో జన్మించింది వయ్యారి భామ పాయల్ రాజ్ పుత్. తల్లిదండ్రులు విమల్ కుమార్ రాజ్ పుత్, నిర్మల్ రాజ్ పుత్.
టెలివిజన్ లో ప్రసారం అయ్యే సప్నోన్ సే భరే నైనాలో సోనాక్షి అనే పాత్రతో కెరీర్‌ని ప్రారంభించింది ఈ బ్యూటీ.
తర్వాత ఆఖిర్ బహు భీ తో బేటీ హీ హైలో సియా అనే ప్రధాన పాత్రను పోషించింది. గుస్తాఖ్ దిల్‌లో ఇషానీగా, మహాకుంభ్: ఏక్ రహస్యా, ఏక్ కహానీలో మాయగా నటించింది.
2017లో చన్నా మేరేయా అనే ఓ పంజాబీ చిత్రంతో హీరోయిన్ గా సినీ అరంగేట్రం చేసింది ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్.
2018లో వీరే కి వెడ్డింగ్ అనే హిందీ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రంలో కథానాయకిగా బాలీవుడ్ కి పరిచయం అయింది ఈ భామ.
యంగ్ హీరో కార్తికేయకి జోడిగా 2018లో వచ్చిన ఆర్ఎక్స్ 100 చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈ అందాల తార.
2019లో సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా వచ్చిన N.T.R: కథానాయకుడు చిత్రంలో జయసుధ పాత్రలో ఆకట్టుకుంది ఈ వయ్యారి.
తర్వాత కొన్ని తెలుగు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కిరాతక, మంగళవారం ప్రధాన పాత్రల్లో నటిస్తుంది ఈ అందాల భామ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి