TV9 Telugu
ఓటీటీని షేక్ చేస్తున్న మంగళవారం మూవీ.!
27 December 2023
లవ్, రొమాన్స్, ఫ్యామిలీ అండ్ కామెడీ కథల కంటే.. సస్పెన్స్ థ్రిల్లర్స్‌నే ఎక్కువ ఇష్టపడుతున్నారు ఫిల్మ్ లవర్స్.
వారి ఇష్టానికి తగ్గట్టే థియేటర్లో అందర్నీ సీటు అంచున కూర్చోబెట్టిన మంగళవారం సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
అలా స్ట్రీమింగ్ మొదలైందో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా కూడా చేసుకుంటోంది.
అజయ్ భూపతి డైరెక్షన్లో.. పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్లో తెరకెక్కిన ఫిల్మ్ మంగళవారం.
భారీ అంచనాల మధ్య 17న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
డిసెంబర్ 26 అర్థరాత్రి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు రీసెంట్ గా అనౌన్స్ చేసింది.
ఇక చెప్పినట్టే.. ఈ మూవీ డిసెంబర్ 26 అర్థారాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
దాంతో పాటే.. థియేటర్ రేంజ్ రెస్పాన్స్ దక్కించుకుంటోంది మంగళవారం మూవీ.
ఇక్కడ క్లిక్ చెయ్యండి