మంగళవారంకు అవార్డుల పంట.. నా సామిరంగ సెలబ్రేషన్స్.. 

TV9 Telugu

30 January 2024

అజయ్ భూపతి దర్శకత్వంలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా మంగళవారం.

తాజాగా ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు.

జైపూర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 4 అవార్డ్స్ సొంతం చేసుకుంది తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మంగళవారం.

ఉత్తమ నటిగా పాయల్ రాజ్ పుత్.. బెస్ట్ సౌండ్ డిజైనర్‌గా MR రాజా కృష్ణన్.. బెస్ట్ ఎడిటర్‌గా గుళ్ళపల్లి మాధవ్ కుమార్.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా ముదసర్ మొహమ్మద్ ఎంపికయ్యారు.

నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ హీరోలుగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సంక్రాంతి సినిమా నా సామిరంగ.

ఆషిక రంగనాథ్, మీర్న మీనన్, రుక్సార్ ధిల్లాన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. పండక్కి విడుదలైన ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి.

తాజాగా నా సామిరంగ సినిమా విజయం సాధించిన సందర్భంగా దీన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు సినిమా యూనిట్.

తాజాగా యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం నా సామిరంగ బ్లాక్‌బస్టర్ సంబరాలు జరిగాయి. మూవీ టీమ్ అంతా ఈ వేడుకలో పాల్గున్నారు.